సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మంగళవారం నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.
సమీక్ష కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు, దర్యాప్తు చేసేందుకు అనుమతివ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. గత నెల 19న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు ఆయనపై సస్పెన్షన్ కొనసాగించాలని సమీక్షా కమిటీ సిఫార్సు చేసిందని అందులో పేర్కొన్నారు.
- ఇదీ చదవండి: ‘సలార్’ చిత్ర యూనిట్ వ్యాన్ను ఢీకొన్న లారీ