తన ప్రయాణికులకు చల్లదనం పంచేందుకు ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఆటో టాప్‌ను నర్సరీలా మార్చేశాడు. పర్యావరణానికి మేలు చేకూరుస్తూనే చల్లదనాన్ని పొందవచ్చు అనే అతని ఐడియాకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఇతని ఆటో ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చూడటానికి "నేనాటోవాడ్ని.. ఆటోవాడ్ని.. అన్నగారి రూటు వాడ్ని'' అంటూ బాషాలో రజనీకాంత్‌లా కనిపిస్తున్నప్పటికీ.. ఇతను మాత్రం మన తెలుగువాడేనని అనటంలో సందేహం లేదు. ఫోటో ఏ ఊరిలోదో తెలియకపోయినా అతని ఆలోచన మాత్రం అబ్బురపరుస్తోంది. సృజనాత్మకతతో పని చేయటానికి చదువే అక్కర్లేదు. సాధారణ ప్రజల్లోనూ, చిన్నచిన్న వృత్తుల్లోనూ కూడా కళాత్మకంగా, సృజనశీలతతో సేవలు అందించవచ్చని ఈ ఆటోవాలా నిరూపించాడు.
ఇవీ చూడండి: '120 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ఏమైంది...?'