ETV Bharat / state

కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవల బంద్... రోగుల ఇక్కట్లు - patients_suffering

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలవటం వల్ల పేదలు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది కొరత... ప్రైవేటులో సేవలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉందని రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆరోగ్యశ్రీ సేవల బంద్... రోగుల ఇక్కట్లు
author img

By

Published : Aug 18, 2019, 5:24 AM IST

Updated : Aug 18, 2019, 6:39 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ, ఈహెచ్​ఎస్ సేవలు నిలిపివేయటం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా పేర్కొనే గుండె, కిడ్నీ రోగులకు రక్త మార్పిడీ ప్రక్రియలను అందించటం లేదంటూ కొన్ని ఆస్పత్రుల బయట ఏకంగా బోర్డులు పెట్టడం గమనార్హం. రోగులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఉస్మానియా, గాంధీల్లో ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది.

ఆరోగ్యశ్రీ సేవల బంద్... రోగుల ఇక్కట్లు

దూర ప్రాంతాల నుంచి రాక...

నగరంలో పేరొందిన ప్రైవేట్ ఆసుపత్రిల్లో చికిత్స కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది రోగులు వస్తుంటారు. ఏపీకి సంబంధించి గుండె, కేన్సర్ కేసులను ఇక్కడి ఆసుపత్రుల్లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన ఆరోగ్యశ్రీ రోగులు, ఈహెచ్​ఎస్ రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సేవలను అందించేందుకు ముందుకొస్తున్నా... చికిత్సకయ్యే ఖర్చులో 50శాతం ముందే డిపాజిట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్య శ్రీ నిలిచిపోలేదు...

ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఈ సేవలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇవీచూడండి: ఆరోగ్య శ్రీ నిలుపుదల... పేదలకు చికిత్స ఎలా?

sample description
Last Updated : Aug 18, 2019, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.