స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది. పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్కరి ఆధార్ వివరాలు విధిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆధార్ లేకపోయి ఉంటే వెంటనే సంబంధిత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఆధార్ వివరాలు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు బయోమెట్రిక్ విధానంలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బయోమెట్రిక్ సరిగ్గా లేకపోతే ఐరిస్ లేదా ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని తెలిపింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సంబంధిత ఏజెన్సీ తగిన చర్యలు తీసుకోవాలని... ఈ కారణంచే లబ్ధిదారులకు రాయితీ అందకుండా ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: రెమ్డెసివిర్, ఆక్సిజన్ కొరత లేదు: హరీశ్ రావు