ETV Bharat / state

FREE WATER: ఉచిత నీటి పథకం పొందేందుకు జలమండలి మరో అవకాశం - free water scheme in hyderabad

సర్కార్‌ ఇచ్చిన ఉచిత నీటి పథకం సదవకాశాన్ని వినియోగించుకొనేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వినియోగదారులకు జలమండలి మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీ వరకు ఇందుకు గడువిచ్చింది. ఈలోగా సుమారు 5 లక్షల మంది నల్లాదారులు తమ పీటీఐఎన్‌ నంబరుతోపాటు ఆధార్‌ నంబరును అనుసంధానించాల్సి ఉంటుంది.

ఉచిత నీటి పథకం పొందేందుకు జలమండలి మరో అవకాశం

author img

By

Published : Jul 8, 2021, 7:55 AM IST

గత బల్దియా పాలకవర్గ ఎన్నికల హామీల్లో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో ఉచిత తాగునీటిని అందరికీ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు కొన్ని నిబంధనలను రూపొందించారు. ప్రతి నల్లాదారుడు తమ పీటీఐఎన్‌ నంబరుతోపాటు ఆధార్‌ నంబరును జలమండలి వెబ్‌సైట్​లోకి వెళ్లి అనుసంధానం చేసుకోవాలన్నది మొదటి నిబంధన. రెండోది నల్లాకు తప్పనిసరిగా మీటరు ఏర్పాటు చేయడం. ఈ రెండూ ఉంటేనే ఉచిత తాగునీటి పథకానికి అర్హులని పేర్కొంది.

గత ఏడాది డిసెంబరు నుంచి ఉచితంగా నీరు ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు అనుసంధానానికి గడువు ఇచ్చింది. మొత్తం 10.50 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే 9.50 లక్షల కనెక్షన్లు గృహాలకు సంబంధించినవి. వీరంతా పథకంలో భాగం కావాలన్న ఉద్దేశంతో జలమండలి ఎండీ దానకిశోర్‌ సిబ్బందిని అపార్ట్​మెంట్లకు పంపి.. అనుసంధానం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున కృషి చేసినా.. చాలా మంది ముందుకు రాలేదు. 4.50 లక్షల మంది మాత్రమే స్పందించారు. గడువు ముగియడంతో మిగతా ఐదు లక్షల నల్లాదారులకు ఏడు నెలల బిల్లు ఒకేసారి జారీ చేశారు. దీంతో మరోసారి గడువిస్తే ప్రక్రియ పూర్తి చేస్తామని వినియోగదారులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మరో 40 రోజులు గడువు ఇచ్చారు.

రోజుకు 2 వేల మందే!

40 రోజుల్లో అయిదు లక్షల మంది నల్లాదారులు అనుసంధానం కావాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు 2 వేల మంది మాత్రమే అనుసంధానం అవుతున్నారని జలమండలి అధికారులు తెలిపారు. ఈ ప్రకారం చూస్తే ఈ 40 రోజుల్లో గరిష్ఠంగా లక్ష మంది మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనంలో చైతన్యం తీసుకురావడానికి సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది.

300 మంది సిబ్బందికి బాధ్యతలు..

ఆగస్టు 15వ తేదీలోగా స్పందించకపోతే తొమ్మిది నెలల బిల్లు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రతి నల్లాదారుడికి నోటీసు ఇస్తోంది జలమండలి. తాగునీటి సరఫరాను నిలిపివేయాలన్న ఆలోచనలో ఉంది. అనుసంధానం కోసం 300 మంది ఉద్యోగులను రంగంలోకి దిగనున్నారు. ప్రతి అపార్టుమెంట్‌ వద్దకు వెళ్లి, ఆధార్‌, పీటీఐఎన్‌ నంబర్లు ఇవ్వని ఫ్లాట్ల యజమానులకు నచ్చజెప్పాలని చూస్తోంది. కేవలం 2.50 లక్షల నల్లాలకే మీటర్లుండడంతో వాటిపైనా దృష్టిసారించనుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.