ETV Bharat / state

Free Water: నల్లా కనెక్షన్​కు ఆధార్​ అనుసంధాన గడువు మరోసారి పెంపు - Aadhaar connection deadline extended for free water

జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తోన్న వినియోగదారులు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కోసం కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం గడువును రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్టణాభివృద్ధిశాఖ మరోసారి పెంచింది. ఈ మేరకు ఆగస్టు 15 వరకు గడువును పెంచుతున్నట్లు జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

నల్లా కనెక్షన్​కు ఆధార్​ అనుసంధాన గడువు మరోసారి పెంపు

author img

By

Published : Jul 6, 2021, 10:39 PM IST

జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తోన్న వినియోగదారులు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కోసం కొత్త మీటర్ బిగింపు, ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువును పొడిగించారు. ఆగస్టు 15 వరకు గడువును పెంచుతున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్టణాభివృద్ధిశాఖ ఆదేశాల మేరకు జలమండలి నగరంలోని వినియోగదారులకు ఆగస్టు 15 వరకు తాగునీరు, సీవరేజీ బిల్లులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం నీటి మీటర్లు కలిగిన డొమెస్టిక్ వినియోగదారులు ఆగస్టు 15 వరకు ఈ పథకం పొందేందుకు తమ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.

ఈ పథకానికి అర్హత పొందడానికి వినియోగదారులు తమ క్యాన్ నెంబర్​కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని జీహెచ్​ఎంసీ తెలిపింది. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు తమ కనెక్షన్లకు మీటర్ బిగించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

వినియోగదారులు తమ కనెక్షన్లకు ఆధార్​ను అనుసంధానం చేసుకోవాలంటే తమ దగ్గరలో ఉన్న మీ-సేవా కేంద్రాల్లో గానీ, నేరుగా జలమండలి వెబ్​సైట్ www.hyderabadwater.gov.in ను సందర్శించి అనుసంధానం చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వినియోగదారులు మరింత సమాచారం కోసం కస్టమర్ కేర్ 155313ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: TS CORONA CASES: రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా... కొత్తగా 784 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.