ETV Bharat / state

ప్రేమించాడు.. పెళ్లాడతానన్నాడు.. చివరకు రేప్ చేసి.. - పెళ్లి చేసుకుంటానని జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం

Youngman rapes Junior Artist in Hyderabad : ప్రేమ పేరుతో ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్టును పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.బాధిత యువతి స్థానిక పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Youngman Cheats Junior Artist in the name of LOVE:
Youngman Cheats Junior Artist in the name of LOVE
author img

By

Published : Feb 18, 2023, 11:04 AM IST

Youngman Cheats Junior Artist in the name of LOVE: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట.. ఎక్కడో ఒక దగ్గర బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ యువకుడు ప్రేమ పేరుతో జూనియర్​ ఆర్టిస్టుపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతికి ఓ చర్చిలో 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన రోహిత్​ఖాన్ పరిచయమయ్యాడు. ఆ యువతి 2021 సెప్టెంబరులో ఉద్యోగం కోసమని హైదరాబాద్​కి వచ్చింది. ఈ క్రమంలో జూనియర్​ ఆర్టిస్ట్​గా పనిచేస్తూ బోరబండలో నివాసం ఉంటోంది. తాను నగరానికి వచ్చిన విషయం తెలుసుకుని రోహిత్​ఖాన్ హైదరాబాద్​ వచ్చాడు. ఏదో విధంగా ఆ యువతి ఫోన్ నంబరు సంపాదించిన రోహిత్​ తరచూ ఆమెకు ఫోన్ చేయసాగాడు.

అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన రోహిత్ ఖాన్ ప్రేమిస్తున్నాని ఆ యువతిని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దాంతో తనను పెళ్లి చేసుకొమ్మని బాధితురాలు పలుమార్లు కోరినా ఆ యువకుడు తప్పించుకు తిరుగసాగాడు. తాజాగా మరోసారి పెళ్లి విషయం అడగ్గా తాను మరో యువతిని వివాహం చేసుకుంటానన్నాడు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తాను 5 నెలల గర్భవతినని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు 376 రేప్ కేస్‌, 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యపరీక్షల కోసం యువతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.