ETV Bharat / state

స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం - స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి  పెద్దమ్మ  ఇంటికి  కన్నం  వేసింది  ఓ ప్రబుద్ధురాలు. స్నేహితుల సాయంతో ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరీ  చేసేలా  ప్రణాళిక రచించింది. నిమ్మరసంలో నిద్రమాత్రలు వేసి ఇంటి యజమానురాలు ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.  ఆస్పత్రిలో బాధితురాలికి సేవ చేస్తున్నట్లు నటించి.. ఇంటి తాళం చెవిని స్నేహితులకు అందజేసింది. ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు నిందితులు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.

నగలు చోరీ
author img

By

Published : Jul 27, 2019, 5:03 AM IST

Updated : Jul 27, 2019, 9:23 AM IST

స్నేహితులతో కలిసి పెద్దమ్మ ఇంటికి కన్నం

రాష్ట్ర పోలీస్ అకాడమీలో టెలిఫోన్ ఆపరేటర్​గా పనిచేసే పిళ్లా వినయ కుమారి... హైదరాబాద్​ రాంనగర్​లోని గణేశ్ నగర్​లో కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. వినయ కుమారికి వరసకు కుమార్తె అయ్యే కుష్బూ తరచూ ఇంటికి వచ్చి పోయేది. తండ్రి, తమ్ముడు అనారోగ్యం పాలవడం వల్ల కుష్బూకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. వీటిని అధిగమించడానికి పెద్దమ్మ వినయ కుమారి ఇంట్లో దొంగతనానికి కుట్ర పన్నింది. దీనికోసం తన స్నేహితులు సూర్య, వంశీ సాయం తీసుకుంది. ఇంటికి సంబంధించిన దృశ్యాలు, పడకగదిలో ఉండే అల్మరాల దృశ్యాలు చరవాణిలో చిత్రీకరించి వాట్సాప్​లో స్నేహితులకు పంపింది. ఈ నెల 19న వినయకుమారి ఇంటికి వెళ్లిన కుష్బూ.... నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి వినయకుమారికి, ఆమె కుమార్తె కీర్తికి ఇచ్చింది. కీర్తి ఓ గంటలో నిద్రలేచింది. వినయకుమారి అపస్మారక స్థితిలో ఉండటం వల్ల కీర్తి ఆందోళనకు గురై ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న కుష్బూ ఏమీ తెలీనట్లు వారితో పాటు ఆస్పత్రికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అదే రోజు రాత్రి కీర్తి బ్యాగులోంచి ఇంటి తాళాలు తీసుకున్న కుష్బూ.. సూర్యకు అందజేసింది. సూర్య, వంశీ కలిసి వినయ కుమారి ఇంటికి వెళ్లారు. నేరుగా పడకగదిలోని బీరువాలో ఉన్న బంగారం, నగదు తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి యథావిధిగా తాళం వేసి... తాళం చెవిని కుష్బూకు అప్పజెప్పారు. కుష్బూ తాళం చెవిని కీర్తి బ్యాగులో పెట్టింది. ఈ నెల 23న వినయ కుమారి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇంటికి వచ్చిన వినయకుమారి, కీర్తి.. బీరువాలో ఉన్న బంగారం, నగదు కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుష్బూపై అనుమానంతో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన సూర్య, వంశీని అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి 53.8 తులాల బంగారం, రూ.5 లక్షల 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇతరులతో సాన్నిహిత్యంగా మెలిగేటప్పుడు... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. దీనివల్ల ఆధారాలు సేకరించడం, నిందితులను వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి : యువతి అదృశ్యం.. పక్కింటి యువకుడిపై అనుమానం

Intro:Body:Conclusion:
Last Updated : Jul 27, 2019, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.