ETV Bharat / state

మరో వివాదంలో లిస్బన్​​ పబ్​ యజమాని... - హైదరాబాద్​ బేగంపేటలోని లిస్బన్​ పబ్

హైదరాబాద్​ బేగంపేటలోని లిస్బన్​ పబ్​లో మరో వివాదం తలెత్తింది. పబ్​ యజమాని మురళీ కృష్ణ ఓ డ్యాన్సర్​ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు నమోదయింది.

a women files a complaint on lisbon pub owner in hyderabad
మరో వివాదంలో లిస్బన్​​ పబ్​ యజమాని...
author img

By

Published : Jan 30, 2020, 12:47 PM IST

మరో వివాదంలో లిస్బన్​​ పబ్​ యజమాని...

హైదరాబాద్​ బేగంపేటలోని లిస్బన్​ పబ్​ యజమాని మురళీకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. డ్యాన్సర్​పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదయింది.

ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన ఓ మహిళా డ్యాన్సర్ ఈనెల 28న రాత్రి 11 గంటల 55 నిమిషాలకు బేగంపేటలోని లిస్బన్​ పబ్​కు వెళ్లింది. ఆ సమయంలో పబ్​ యజమాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

గతంలోనూ మురళీకృష్ణ తనతో అలాగే వ్యవహరించాడని, నిన్న రాత్రి 7.30 గంటలకు మరోసారి పబ్​కు రాగా లోపలికి అనుమతించకుండా అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పబ్​ యజమానిపై నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.