ETV Bharat / state

స్వచ్ఛంద సంస్థ దాతృత్వం.. ఫ్రీగా ఆక్సిజన్​ సిలిండర్లు ఇచ్చేందుకు నిర్ణయం

కరోనా బాధితులకు సంజీవనిలా పనిచేస్తోన్న ఆక్సిజన్​ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. సుమారు 50 సిలిండర్లను ఫ్రీగా అందించనుంది. ఈ మేరకు అవసరం ఉన్నవారు 9502340895 నెంబర్​ను సంప్రదించాలని ఆ సంస్థ ప్రతినిధులు సూచించారు.

స్వచ్ఛంద సంస్థ దాతృత్వం
స్వచ్ఛంద సంస్థ దాతృత్వం
author img

By

Published : May 10, 2021, 2:25 PM IST

కరోనా రెండో దశలో ఆక్సిజన్ లేక మృతి చెందుతున్న వారి దీనస్థితిని చూసి మీన్హాజ్​ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దాదాపు 50 ఆక్సిజన్ సిలిండర్లను కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కంటోన్మెంట్​లోని బోయిన్​పల్లి పెన్షన్ కాలనీలోని మిన్హాజ్ సంస్థ కార్యాలయంలో ఆక్సిజన్ సిలిండర్లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

గత నలభై సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి షాహిద్​ ఉల్​ ఖాద్రి పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. దాదాపు 50 ఆక్సిజన్ సిలిండర్లు, 350 నిత్యావసర సరుకుల కిట్లను ప్రజలకు అందజేయనున్నట్లు వివరించారు. ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఉన్నవారు 9502340895 నెంబర్​ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సయ్యద్ ఇమ్రాన్, యాకుబ్ ఖాద్రి, అబ్దుల్ సాజిద్, జియా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. వైద్యశాఖలో తాత్కాలిక నియామకాలకై కసరత్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.