ETV Bharat / state

రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు - Fallen tree in Mushirabad constituency

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వీఎస్టీ​ నుంచి రాంనగర్​కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు కూలి ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో వీఎస్టీ నుంచి రాంనగర్​కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

A tree fallen on the musheerabad road traffic stopped
రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు
author img

By

Published : Sep 10, 2020, 6:31 PM IST

రోడ్డుపై కూలిన చెట్టు.. నిలిచిపోయిన రాకపోకలు

నగరంలో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా వీఎస్టీ​ నుంచి రాంనగర్​కు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు అడ్డంగా నేలకొరిగింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో వీఎస్టీ నుంచి రాంనగర్​కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు వర్షం నీరు రోడ్డుపై నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కూలిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమాచారం జీహెచ్ఎంసీ డీఆర్​ఎఫ్​ పోలీసులకు తెలుపగా.. ఆ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు.

ఇదీ చూడండి : భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.