ETV Bharat / state

వితంతు పింఛన్​ను.. వృద్ధాప్య పింఛన్​గా మార్చి.. చివరికి తొలగించారు - Prakasam district penstions news

Different experience for the widow woman: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వితంతువు మహిళ శింగంశెట్టి హనుమాయమ్మకు వింత సంఘటన ఎదురైంది. వితంతువు పింఛన్.. కాస్తా వృద్దాప్య పింఛన్‌గా మారి తొలగింపునకు గురైందని కన్నీరుమున్నీరైంది. కారణం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తే వింత సమాధానాలు చెప్తున్నారని ఆవేదన చెందింది.

శింగంశెట్టి హనుమాయమ్మ
శింగంశెట్టి హనుమాయమ్మ
author img

By

Published : Jan 4, 2023, 4:54 PM IST

శింగంశెట్టి హనుమాయమ్మ ఆవేదన

Different experience for the widow woman: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వితంతువు మహిళ శింగంశెట్టి హనుమాయమ్మకు వింత సంఘటన ఎదురైంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు మరణించి సుమారు 28 ఏళ్లు అవుతుంది. గత ప్రభుత్వాల హయంలో ఆమె వితంతువు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగా.. మంజూరైంది. ఈ క్రమంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆమెకు వితంతువు పింఛన్ ఇస్తున్నారు. అయితే గత సంవత్సరం హనుమాయమ్మకు పింఛన్ నిలుపుదల చేశారు. కారణం ఏమిటని అధికారులను ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానానికి హనుమాయమ్మ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

హనుమాయమ్మ తీసుకునేది వితంతువు పింఛన్.. కానీ ఆమెకు నిలుపుదల చేసింది వృద్దాప్య పింఛన్. దీనిని బట్టి జగనన్న ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుస్తోందని స్థానికులు అధికారులపై ఆగ్రహించారు. హనుమాయమ్మ అధికారులను వివరణ అడిగితే ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సమాధానం చెప్తున్నారని కన్నీరుమున్నీరైంది.

మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వల్ల పింఛన్ రావటం లేదని ఓ అధికారి చెప్పారని వాపోయింది. మరొకరు మీ పేరు మీద పొలం ఎక్కువగా ఉన్నందుకు పింఛన్ రావటం లేదన్నారని పేర్కొంది. తనకు నలుగురు సంతానమని.. వారంతా వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారని.. అసలు పొలానికి, వితంతువుకి సంబంధం ఏంటి అని ఆమె ప్రశ్నించింది.

మా ఇంటి పేరుతో ఉన్న మా బంధువుల కుమారునికి ఒకరికి సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. ఇంటి పేర్లు ఒకటే కావటం చేత మీ కుటుంబంలో ఉద్యోగం ఉన్నందు వల్ల నీ పింఛన్ తొలగిపోయిందని చెప్పారు. వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు సంవత్సరం క్రితం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికొచ్చి నీకు పింఛన్ తెప్పించటానికి ప్రయత్నిస్తానని చెప్పి నాతో సంతకం పెట్టించుకున్నాడు. అప్పటి నుంచి నాకు పింఛన్ రావటం లేదు. ఈ విషయం గురించి స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించాను. ఆయన సంబంధిత అధికారులకు చరవాణీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. మండలాభివృద్ది అధికారికి దగ్గరికి వెళితే.. మీ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నారని నీవే ఒప్పుకొని సంతకం చేసినట్లు పత్రం కూడా ఉందని తెలిపారు. -హనుమాయమ్మ, నడింపల్లి గ్రామం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.