ETV Bharat / state

అందుకే పీహెచ్‌డీ చేసినా కూరగాయలు అమ్ముతున్నా!

‘మనం చదివిన ఉన్నత చదువులు మనం ఊహించుకున్న జీవితాన్ని, ఆదాయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ అక్షర జ్ఞానం తోడుంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాగైనా బతికేయొచ్చు’... ఈ మాటలు అక్షరాలా నిజమని నిరూపిస్తోంది ఇండోర్‌కు చెందిన రైసా అన్సారీ. తను నేర్చుకున్న అక్షరాలతో అనుకున్న జీవితం, ఆదాయం పొందలేని ఆమె ఆత్మాభిమానాన్ని మాత్రం మెండుగా సంపాదించుకుంది. అందుకే మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసినప్పటికీ పొట్టకూటి కోసం ప్రస్తుతం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటోంది. అదే ఆదాయంతో తన కుటుంబాన్ని కూడా పోషిస్తోంది. అయితే మనం చదివిన చదువు ఎప్పటికీ వృథా కాదని నిరూపిస్తూ...తన తోపుడు బండిని తొలగించేందుకు వచ్చిన అధికారులను ఆంగ్లభాషలోనే నిలదీసింది ట్యాలెంటెడ్‌ వుమన్. దీంతో అక్కడికొచ్చిన అధికారులు డిఫెన్స్‌లో పడిపోయి ఆమెతో సంప్రదింపులకు దిగారు.

a-story-on-phd-holder-sell-vegetables
అందుకే పీహెచ్‌డీ చేసినా కూరగాయలు అమ్ముతున్నా!
author img

By

Published : Jul 25, 2020, 11:53 PM IST

  • పీహెచ్‌డీ పట్టా ఉన్నా!

చైనాలో పుట్టిన కరోనా... నేడు ప్రపంచమంతా పట్టి పీడిస్తోంది. గత ఏడు నెలలుగా అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ఈ మహమ్మారి కారణంగా పలువురి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడదామనుకున్న వారి కలలను కల్లలుగా మార్చేసింది. దీంతో ఉపాధి కోసం చాలామంది అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొంటున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఉన్నత చదువులు పూర్తిచేసిన రైసా అన్సారీ కూడా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది. ఇందులో భాగంగా దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా కూడా అందుకుంది. అయితే అనుకోకుండా కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకోవాల్సి వచ్చిన ఆమె మూడేళ్ల క్రితం కూరగాయల వ్యాపారిగా మారిపోయింది.

  • ఆంగ్లంలో అదరగొట్టింది!

ప్రస్తుతం ఓ తోపుడు బండి సహాయంతో రోడ్లపై కూరగాయలు విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది రైసా అన్సారీ. అయితే తన కుటుంబానికి ఏకైక జీవనా ధారంగా ఉన్న ఈ బండిని అక్కడి మున్సిపల్‌ అధికారులు తొలగించారు. దీంతో ఆ అధికారుల దాష్టీకాన్ని ఇంగ్లిష్‌లో ఎండగట్టింది రైసా. అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడి అధికారులతో పాటు అక్కుడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా అధికారులు, అక్కడికొచ్చిన జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా ఇంగ్లిష్‌లోనే సమాధానమిచ్చిందీ ట్యాలెంటెడ్‌ వుమన్.

  • ఇలా అయితే మేం ఎలా పొట్ట నింపుకోవాలి?

‘ఈ ఆపత్కాలంలో ఓవైపు మార్కెట్‌ పూర్తిగా మూతపడింది. ఇక కరోనా నేపథ్యంలో రెండో మార్కెట్‌ను కూడా అధికారులు మూయించారు. ఈ మహమ్మారికి భయపడి బయట కూరగాయలు కొంటున్న వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో మా వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? నేను ఇక్కడ కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నాను. మా ఫ్యామిలీలో 20మందికి పైగా ఉంటాం. మేమంతా ఎలా పొట్టనింపుకోవాలి?మాకు ఆదాయమార్గమేదీ? నా బండి దగ్గర ఎలాంటి రద్దీ కూడా లేదు. అయినా మున్సిపల్‌ అధికారులు నా బండిని తొలగించారు’ అని చెప్పుకొచ్చింది రైసా.

  • సైంటిస్ట్‌ను అవుదామనుకున్నా.. కానీ..!

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నాడు. దీంతో ఇంగ్లిష్‌లో మాట్లాడి అదరగొట్టిన ఆమె ఒక్కసారిగా ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. ఈనేపథ్యంలో ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ‘ సైంటిస్ట్‌ అవ్వాలనేది నా చిన్న నాటి కల. అందుకు అనుగుణంగానే మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా సాధించాను. ఆ తర్వాత కొన్ని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నాకున్న పరిజ్ఞానాన్ని మరికొందరి విద్యార్థులకు అందించాను. అయితే మూడేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించడానికి కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పటికీ నాకు చదువు, పుస్తకాలంటే చాలా ఆసక్తి ఉంది. అయితే నాకున్న సమస్యలు పుస్తకాలకు నన్ను దూరం చేశాయి. ఈ మూడేళ్ల కాలంలో నేను ఎదుర్కొన్న వ్యక్తిగత సమస్యలు నా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యతో పాటు డబ్బు కూడా చాలా అవసరమే. అయితే నా సమస్యలు తొలగిపోయి మళ్లీ అవకాశమొస్తే సైంటిస్ట్‌ కావాలనుకున్న నా కలను నెరవేర్చుకుంటాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది రైసా.

పీహెచ్‌డీ చేసినా తన కుటుంబం పోషణ కోసం కూరగాయల వ్యాపారిగా మారిపోయింది రైసా అన్సారీ. అయితే కరోనా కారణంగా ఆ వ్యాపారం కూడా దెబ్బతింది. అయితే ఎప్పటికీ ఇలాగే ఉండదని, కరోనా తగ్గిపోయి త్వరలోనే సాధారణ పరిస్థితులు మొదలవుతాయని, మళ్లీ తన కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభిస్తానని ధీమాతో చెబుతోంది రైసా. మరి ఆమె కోరుకున్నట్లు ఈ కరోనా అంతమైపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు మొదలవ్వాలని, అదేవిధంగా సైంటిస్ట్‌ అవ్వాలనుకున్న తన కల కూడా నిజం కావాలని మనమూ కోరుకుందాం.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.