డాక్టర్లపై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినంగా పాటిస్తున్నట్లు... ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తెలిపింది. దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్ల రంగు బ్యాడ్జిలు ధరించి అన్ని ఆసుపత్రుల ముందు నిరసన చేపట్టనున్నట్లు ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ లవకుమార్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నామని ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 700 మంది డాక్టర్లు కొవిడ్‌పై పోరాటంలో ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. అయినప్పటికీ డాక్టర్లపై దాడులు జరగడం బాధాకరమన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ... కొన్ని సందర్భలలో ప్రాణాలను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతామని డాక్టర్ లవకుమార్ పేర్కొన్నారు. దానికి మమ్మల్ని బాధ్యులు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించడాన్ని ఖండించారు. నిరసన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర డీజీపీకి వినతి పత్రాలు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Etela: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు ఘనస్వాగతం