ETV Bharat / state

వండర్​కిడ్​: ప్రపంచమెరిగిన బాలుడు.. భవిష్యత్​ వ్యోమగామి..! - a special story on wonder kid manvik at hyderabad malkajgiri

సాధారణంగా ఐదేళ్ల వయస్సు పిల్లలు ఏం చేస్తారు మహా అయితే ఆడుకోవడం... అమ్మపెడితే తినడం లాంటివి చేస్తూ సరదాగా ఆడుతూపాడుతూ ఉంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం ప్రపంచాన్ని అప్పజెపుతాడండోయ్​.. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా..! కరోనా సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌ని సైతం తన కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరిచేతా ఔరా మాన్విక్​ అనిపించుకుంటున్న మల్కాజ్​గిరికి చెందిన ఈ చిన్నారి కథేంటో చూద్దామా..

a special story on wonder kid manvik at hyderabad malkajgiri
వండర్​కిడ్​: ప్రపంచమెరిగిన బాలుడు.. భవిష్యత్​ వ్యోమగామి..!
author img

By

Published : Aug 21, 2020, 7:31 PM IST

పసి ప్రాయంలో అద్భుత ప్రతిభ కనపరుస్తూ అందరిచేత ఔరా అనిపిస్తున్నాడు ఐదేళ్ల చిన్నారి మాన్విక్. హైదరాబాద్​ మల్కాజ్​గిరి ఆనంద్​బాగ్​లోని భ్రమరాంబిక నగర్​లో నివాసం ఉంటున్న వేణుగోపాల్, కిరణ్మయిల దంపతుల తనయుడు మాన్విక్ నిజాంపేటలోని విజ్ఞాన్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. చదువులో చురుకుగా ఉండే మాన్విక్ చిన్నతనంలోనే సామాజిక, ప్రపంచ భౌగోళిక అంశాల పట్ల ఆసక్తి కనబరిచేవాడు.

ప్రపంచాన్ని అలవోకగా అప్పజెపుతాడు

ఈ తరుణంలో లాక్​డౌన్ రావడం వల్ల ఇంట్లోనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రపంచ పటాలలో ప్రముఖ ప్రాంతాలను గుర్తించడం, దేశాల పేర్లు, ప్రపంచ పటాన్ని అమర్చడం, ప్రపంచ దేశాల పతాకాలను గుర్తించడం, భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల సమాచారం, ప్రపంచ భౌగోళిక స్థితిగతులు, ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక కట్టడాలు వాటి విశేషాలను తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుని అలవోకగా అప్పజెప్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ పటానికి సంబంధించిన అనేక విషయాలను గ్రహించి, తన మేధోశక్తిని ఉపయోగించి వాటిపై పట్టు సాధించి అడిగిన వాటికి గుక్కతిప్పకుండా సమాధానం చెప్తూ ఔరా మాన్విక్​ అనిపించుకుంటున్నాడు.

భవిష్యత్​ వ్యోమగామికి తమ వంతు సాయం

తమ కొడుకు చిన్న వయసులోనే చదువులో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడని.. ప్రపంచ సామాజిక అంశాల పట్ల గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని మాన్విక్​ తల్లిదండ్రులు పేర్కొన్నారు. మాన్విక్​ జ్ఞాపకశక్తిని చూసి మురిసిపోతున్నారు. ప్రపంచంలోని అనేక అంశాలను అలవోకగా క్షణాల్లో చెప్తున్న తమ పుత్రుడిలో నైపుణ్యాన్ని మరింత పెంచి అతని అభివృద్ధికి కృషి చేస్తామని వారు వెల్లడించారు. భవిష్యత్తులో అంతరిక్ష వ్యోమగామి కావాలన్న తన కలలను సాకారం చేసే విధంగా తల్లిదండ్రులుగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

రాబోయే రోజుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారిని సంప్రదించి తన కొడుకు నైపుణ్యాన్ని చాటి చెబుతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.