ETV Bharat / state

ప్రశంసల వెల్లువలు.. భగీరథ నల్లా నీళ్లు..!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ యత్నం ఫలించి ఇంటింటా నల్లానీరు పారుతోంది. మారుమూల, అటవీప్రాంతాల్లోని ఆవాసాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వందశాతం శుద్ధిచేసిన జలాలను సరఫరా చేస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను సైతం అందుకున్న మిషన్ భగీరథ పథకం... ఇపుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

author img

By

Published : Aug 23, 2020, 10:51 AM IST

Updated : Aug 23, 2020, 11:04 AM IST

a-special-mission-bhageeratha-results
ప్రశంసల వెల్లువలు.. భగీరథ నల్లా నీళ్లు..!

ఇంటింటికీ నల్లానీరు అందించాలనే బృహత్ లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం రికార్డు స్థాయిలో పూర్తైందనే చెప్పుకోవచ్చు. ఏడాదికే తొలి ఫలాలను అందించారు. 2015 జూన్ తొమ్మిదో తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్​లో మిషన్ భగీరథ పైలాన్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఫ్లోరైడ్ సమస్య పీడించిన ఆ ప్రాంతం నుంచే ఇంటింటికీ నల్లానీరు అందించే పథకం పనులకు శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన గజ్వేల్ సెగ్మెంట్​ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా 2016 ఆగస్టు ఏడో తేదీన ప్రారంభించారు. దీనితో ఆ రోజు నుంచి రాష్ట్రంలో మిషన్ భగీరథ ఫలాలు అందడం ప్రారంభమైంది.

ప్లోరోసిస్​ ప్రాంతంతో ప్రారంభమై...

ప్రారంభం నాటి నుంచి దశలవారీగా ఆయా సెగ్మెంట్లలో మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తూ ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 23వేలా 968 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన జలాలను బల్క్​గా అందిస్తున్నారు. అందులో 23వేలా 919 ఆవాసాల్లోని అన్ని ఇండ్లకు నల్లాల ద్వారా కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మరో 49 ఆవాసాల్లో మాత్రమే నల్లానీరు సరఫరా చేయాల్సి ఉందని మిషన్ భగీరథ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 55లక్షలా 59వేలా 172 ఆవాసాలకు గాను వందశాతం నల్లా కనెక్షన్ కూడా ఇచ్చారు. అందులో 55లక్షలా 26వేలా 518 ఇండ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.

రాష్ట్రాలకు కేంద్రం సిఫారసులు..

మిషన్ భగీరథ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని యూనిసెఫ్​తో కలిసి సెస్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని తెలిపింది. పథకానికి ఇప్పటికే ఎన్నో ప్రశంసలు, అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం సైతం మిషన్ భగీరథను ప్రశంసించింది. నీతిఆయోగ్ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ మిషన్ భగీరథను అమలు చేయాలని సిఫారసు చేసింది. నీటి సరఫరా, నియంత్రణ కోసం మిషన్ భగీరథలో వాడుతున్న స్కాడా విధానం వల్ల అందరికీ ఒకే వేగంతో నీరు అందుతోందని... అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని జల్ జీవన్ మిషన్ సిఫారసు చేసింది.

ఆసక్తి కనపరుస్తున్నాయ్​..

వివిధ రాష్ట్రాలు పథకం అమలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన మిషన్ భగీరథ విధానాన్ని అధ్యయనం చేశాయి. ఇప్పటి వరకు దాదాపు 18 రాష్ట్రాల ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి పరిశీలించారు. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబంగ, ఒడిషా, కర్నాటక తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Last Updated : Aug 23, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.