పది నిమిషాల వ్యవధిలో తనకు రెండు డోసుల టీకా వేశారని హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ సీతారాంబాగ్‌కు చెందిన గోపాల్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను టీకా తీసుకునేందుకు సోమవారం పేరు నమోదు చేసుకున్నానని, శాంతినగర్(విజయనగర్‌కాలనీ)లోని వెట్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో మొదటి డోసు తీసుకోవాలని ఎస్‌ఎంఎస్ వచ్చిందని తెలిపారు.
‘‘మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కొవిషీల్డ్ టీకా వేయించుకున్నా. మాత్ర తీసుకునేందుకు పక్క కౌంటర్‌కు వెళ్లా. పది నిమిషాలు వేచి చూశా. అక్కడ టీకా వేస్తున్న నర్సు మీకు షుగర్, బీపీ ఉన్నాయా? అని ఆరాతీశారు. మాట్లాడుతుండగానే మరో టీకా వేశారు. ఇంకేదైనా ఇంజక్షన్ ఇస్తున్నారేమో అనుకున్నా. అంతకు ముందే మొదటి కౌంటర్‌లో టీకా తీసుకున్నానని చెప్పడంతో ఆమె కంగారు పడ్డారు. అరగంట పాటు నా ఆరోగ్య స్థితిని పరిశీలించిన వైద్య సిబ్బంది అనంతరం ఇంటికి పంపించారు’’
-గోపాల్‌సింగ్
ఈ విషయంపై ఆరోగ్య కేంద్రం ఇంఛార్జీ డా.మహేశ్ మాట్లాడుతూ.. గోపాల్‌సింగ్‌కు ప్రస్తుతం ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఆయన ఆరోగ్య స్థితి పరిశీలించాకే ఇంటికి పంపించామని వెల్లడించారు.
ఇదీ చదవండి: CORONA: ఇది ఊరటే.. మహమ్మారి ఊరొదిలి పోలే