హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ పరిధి బర్కత్పురాకి చెందిన ఓ వ్యక్తికి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో డింపుల్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి నగ్న ఫొటోలతో చాటింగ్ చేసుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో అబ్బాయికి సంబంధించిన కాంటాక్ట్స్ వివరాలను డింపుల్ సేకరించింది. అనంతరం పురుషుడి తరపు బంధువుకు చాటింగ్ చేసుకున్న న్యూడ్ ఫోటోలను సదరు మహిళ పంపించింది.
రూ.లక్ష ఇస్తావా.. ఫోటోలు పంపనా
మిగతా బంధువులందరికీ పంపకుండా ఉండాలంటే రూ.లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడింది. మోసపోయిన బాధితుడు విడతల వారిగా మూడున్నర లక్షల రూపాయలను డింపుల్ అకౌంట్‌కు బదిలీ చేశాడు. డింపుల్ మరిన్ని డబ్బులు డిమాండ్ చేయగా..బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'