హైదరాబాద్ బోయినపల్లి బస్టాండులో ఓ ఆర్నెళ్ల బాబుతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిజామాబాద్లో ఓ యాచక ముఠా నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు. బాబును స్టేట్హోంలో చేర్పించి... తల్లిదండ్రుల కోసం వాకబు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పదేళ్ల బాలికపై అటెండర్ అత్యాచారయత్నం