పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లోను పెద్దసంఖ్యలో పోటీలో ఉన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏకంగా 96 మంది అభ్యర్థులు ఉన్నారు. నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గంలో 74 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపు సాయంత్రం వరకు గడువుంది. ఉపసంహరణ గడువు ముగిస్తే అభ్యర్థిత్వాలపై పూర్తి స్పష్టత వస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2007లో శాసనమండలి పునరుద్ధరణ సమయంలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అత్యధికంగా 57 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు భారీసంఖ్యలో స్వతంత్రులు పోటీ చేశారు. భారీ బ్యాలెట్ ఉపయోగించడంతో ఓట్ల లెక్కింపునకు అప్పట్లో రెండున్నర రోజుల సమయం పట్టింది. ఈ మారు ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చూడండి: 'ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు'