ETV Bharat / state

బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు చిన్నారి ఫిర్యాదు

బాల్యవివాహాలను రూపుమాపేందుకు ఎంతో మంది మహానుభావులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. కాపాడాల్సిన తల్లిదండ్రులే చిన్నారిని వివాహబంధంలో నెట్టేశారు. వారి ఉచ్చు నుంచి బయటపడి తనకు న్యాయం చేయాలంటూ ఆ చిన్నారి పెళ్లికూతురు పోలీసులను ఆశ్రయించింది. ఏపీ చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

child marrage
బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు చిన్నారి ఫిర్యాదు
author img

By

Published : Nov 13, 2020, 2:17 PM IST

‘మైనార్టీ తీరని నన్ను తల్లిదండ్రులు మోసగించి 34 ఏళ్ల వయసున్న వ్యక్తితో రహస్యంగా వివాహం జరిపించారు. ఆపై విషయం బయటకు పొక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా యువకుడి కుటుంబ సభ్యులు నా మెడలో తాళిని తెంచేశారు’ అని ఓ బాలిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని​ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని పాతగుంటలో చోటుచేసుకుంది.

అర్ధరాత్రి సమయంలో

గ్రామానికి చెందిన బాలికను(16) తల్లిదండ్రులు.. సమీప బంధువులతో కలిసి ఈ నెల పదో తేదీన అర్ధరాత్రి సమయంలో గ్రామానికే చెందిన రాజశేఖర్‌రెడ్డి(34)తో వ్యానులో తరలించి శ్రీకాళహస్తిలోని ఓ ఆలయంలో రహస్య వివాహం జరిపించారు. తనకు ఇప్పుడే వివాహం వద్దని బాలిక వారిస్తున్నా ఇరు వర్గాలు వినలేదు. ఇరువైపులా పెద్దలు అత్తారింట్లో దిగబెట్టారు. గ్రామస్థులు అందించిన రహస్య సమాచారంతో ఐసీడీఎస్‌ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టేలోపే వరుడి తల్లి.. ఆ బాలిక మెడలో మంగళ సూత్రాన్ని తెంచేసింది.

మైనర్‌ అయిన తనను వివాహం పేరుతో వంచించిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలంటూ గురువారం నేరుగా ఎస్సైని కలిసి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు సహా రాజశేఖర్‌రెడ్డి, అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆనంద్​రెడ్డి, మోహన్‌పై బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.