ETV Bharat / state

ఇంట్లో పేలిన గ్యాస్​ సిలిండర్​... నలుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Mar 1, 2020, 4:57 AM IST

Updated : Mar 1, 2020, 7:59 AM IST

a-gas-cylinder-blast-in-a-house-at-hyderabad
ఇంట్లో పేలిన గ్యాస్​ సిలిండర్​... నలుగురికి తీవ్రగాయాలు

04:55 March 01

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అస్మన్‌ఘడ్‌ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో భవన కాపాలాదారుడి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయింది. దీనికి తోడు ఫ్రిడ్జ్‌ నుంచి కూడా నిప్పులు చెలరేగడం వల్ల ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కిటికీ, తలుపుల అద్దాలు, సమీపంలో నిలిపి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. 

పేలుడు జరిగిన భవనం సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌, మరికొన్ని ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కాపాలాదారుడు ఇంటిలో నిద్రిస్తున్న అతని పిల్లలతో సహా దంపతులకు గాయలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Mar 1, 2020, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.