stolen cars selling gang arrest in hyderabad: దొంగిలించిన వాహనాల గుర్తింపును తారుమారు చేస్తూ అమాయకులకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగ కార్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తూర్పు మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కోట్ల 45 లక్షల రూపాయల విలువైన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు హైదరాబాద్కు చెందిన ఠాకూర్ శైలేందర్ సింగ్, అబ్దుల్ రహీం, జావేద్, అలీ ఖాన్, బప్పా గోష్, పరిపూర్ణా చారి, ఖలీల్లు కార్ల దొంగతనంలో కీలక సూత్రధారులుగా ఉన్నట్లు డీసీపీ సునీల్ దత్ తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఖరీదైన కార్లను తమదైన శైలిలో దొంగతనం చేసి కార్ల నెంబర్ ప్లేట్లను, రిజిస్ట్రేషన్ ఇంజన్ నంబర్లు మార్చివేసి సాక్షాధారాలను కనిపించకుండా చేసి కార్ల రూపురేఖలను మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొంతమంది అమాయక ప్రజలకు తక్కువ ధరకే అంటూ ఎరగా చూపి ఖరీదైన కారులను విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కార్ల చోరీకి సంబంధించి 13 కేసులు నమోదైనట్లు డీసీపీ సునీల్ పేర్కొన్నారు. కార్లను డీలింగ్ చేస్తున్న రహీం ఖాన్ అనే వ్యక్తిని విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. విచారణలో భాగంగా రహీం ఖాన్ తనతో పాటు ఉన్న ముఠా సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లు డీసీపీ వెల్లడించారు.
దిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను చోరీ చేస్తారు. వెంటనే వాటి నెంబర్ ప్లేట్లు, ఛాసిస్ నెంబర్ మార్చుతారు. వీటిని ఇతర రాష్ట్రాలలో విక్రయిస్తారు. నిందితుల నుంచి రెండు కోట్ల 45 లక్షల విలువైన 18 కార్లను స్వాధీనం చేసుకున్నాము. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో కార్ల చోరీకి సంబంధించి 13 కేసులు నమోదయ్యాయి. ఈ కార్లను డీలింగ్ చేస్తున్న రహీం ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారించగా ఈ ముఠా సమాచారం బయటపడింది -సునీల్ దత్, తూర్పు మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ
ఇవీ చదవండి: