కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచన ప్రకారం గాంధీ మెడికల్ సిబ్బందికి 1200 యూనిట్ల లెమన్, గ్లూకోజ్ ప్యాకెట్లును భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అందజేశారు. కరోనాపై పోరాటం చేయడంలో ఆస్పత్రి సిబ్బంది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ... మాస్కులను ధరించాలని సూచించారు.
అన్ని తరగతుల ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, రాజశేఖర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, వైద్య సిబ్బంది హాజరయ్యారు.