Warangal Farmer Meet DGP: అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఏ మూలన భూమి ఖాళీగా ఉన్న కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి చూస్తున్నారు. వాటికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరు వచ్చి అడిగిన ఈ స్థలం తమది అని బెదిరించడం మామూలే. ఇలానే నగరాల్లోని శివారు ప్రాంతాల్లో భూములు, పొలాలు కబ్జా చేస్తూ కొందరు స్థానిక నాయకుల బలంతో చెలరేగిపోతున్నారు.
Warangal farmer submitted petition to the DGP: తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లా పోనకల్‌లో చోటు చేసుకుంది. గ్రామంలో తన భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి, తన తమ్ముడికి రాయించారని సురేందర్ అనే రైతు వాపోయాడు. దీనిపై స్థానిక పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో న్యాయం జరగకపోవడంతో న్యాయం కోసం భాగ్యనగరానికి వచ్చాడు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుంచి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని, డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ డీజీపీ కార్యాలయానికి వచ్చాడు.
మీరే న్యాయం చేయాలి: తనకు ప్రభుత్వ పెద్దలే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. కబ్జాదారుల వద్ద ఉన్న పత్రాలు సరైనవే అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఊరి తీయాలని బాధిత రైతు కోరారు. ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర డీజీపీలు జోక్యం చేసుకొని తనకు న్యాయం చేసి, తనకు మోసం చేరిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు కోరారు.
నాగలితో డీజీపీ కార్యాలయానికి చేరుకోగానే సురేందర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా తన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు పోలీసులు సురేందర్‌ను లోనికి అనుమతించారు. తనకు జరిగిన అన్యాయం, కబ్జాదారులు సృష్టించిన నకిలీ పత్రాల గురించి దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని సురేందర్ డీజీపీకి వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: