Family in shopingmall: సరదాగా షాపింగ్ చేద్దామనుకున్న ఓ కుటుంబానికి లిఫ్ట్ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. షాపింగ్ సంగతి పక్కనబెడితే అసలు వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్లో జరిగింది.
![A family stuck in lift](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_52_25_family_steken_left_av_ts10005_2_2512digital_1640438074_1002.jpg)
ఏం జరిగిందంటే...
big bazaar in kachiguda: కాచిగూడలోని బిగ్ బజార్ షాపింగ్ మాల్ లిఫ్ట్‌లో అనూహ్యంగా ఓ కుటుంబం చిక్కుకుంది. సాంకేతిక సమస్య వల్ల ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. అయితే ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే బిగ్ బజార్ చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు శ్రమించి 8 మందిని సురక్షితంగా రక్షించారు. సమయానికి చేరుకుని కుటుంబ సభ్యులను కాపాడినందుకు అగ్నిమాపక సిబ్బందిని నెటిజన్లు అభినందించారు.
![A family stuck in lift](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_52_25_family_steken_left_av_ts10005_1_2512digital_1640438067_146.jpg)
జాగ్రత్తలు తీసుకోరా..
వారు రావడం కాస్తా ఆలస్యమైనా ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని షాపింగ్‌కు వచ్చిన పలువురు అంటున్నారు. నగరంలోని ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్స్‌లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వినియోగదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో షాపింగ్ మాల్స్ నిర్వాహకుల డొల్లతనం బయటపడింది.