తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి ముందు ఉదయం అరగుండు చేసుకుని అర్ధనగ్న ప్రదర్శన కు దిగాడు. కుమారుడుపల్లి నెహ్రూనగర్‌లో నివాసముంటున్న వృద్ధుడు తన బంధువులకు సంబంధించిన భూమి విషయం కోర్టులో నడుస్తుంది. అయినప్పటికీ వారి బంధువులు నిర్మాణాల్లో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వృద్ధుడు ఆరోపిస్తున్నాడు. గతంలో ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా... మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం చేయాలో పాలు పోక అర్ధనగ్న ప్రదర్శన ద్వారానైనా తన సమస్య పరిష్కారం అవుతుందని భావించి నిరసనకు దిగినట్లు తెలిపాడు. అతని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది తిరిగి ఇంటికి పంపించేశారు.. సమస్య తీరేంతవరకు న్యాయపోరాటం చేస్తానని వృద్ధుడు స్పష్టం చేశాడు.
ఇవీ చూడండి; 2041కి తెలంగాణలో పెరగనున్న వృద్ధుల సంఖ్య