ETV Bharat / state

మిద్దెపై సాగు... అన్ని విధాల బాగు బాగు - హైదరాబాద్​లో మిద్దెపై సాగు చేస్తున్న దంపతులు

రోజు, రోజుకు మనం తీసుకునే ఆహారం విషతుల్యం అవుతుంది. అధిక రసాయన ఎరువులతో... పండించిన కూరగాయలు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇది ప్రధానంగా హైదరాబాద్‌ మహానగర వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన నగరానికి చెందిన రాపోలు లక్ష్మీ, రవీందర్‌ దంపతులు తన ఇంటిపైనే తోటను ఏర్పాటు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్ల సాగు చేస్తున్నారు.

మిద్దెపై సాగు... అన్ని విధాల బాగు బాగు
మిద్దెపై సాగు... అన్ని విధాల బాగు బాగు
author img

By

Published : Jan 12, 2021, 10:53 AM IST

హైదరాబాద్‌ బోడుప్పల్‌ పశ్చిమ బాలాజీహిల్స్‌కు చెందిన రాపోలు లక్ష్మీ, రవీందర్‌ దంపతులు తమ దగ్గరలోని కూరగాయల మార్కెట్‌లో ఆకుకూరలు కొనుగోలు చేసేవారు. అవి అంత రుచిగా ఉండకపోగా, పాడైపోయి ఉండడం వల్ల సొంతంగా పండించుకోవాలనుకున్నారు. తమ 180 గజాల ఇంటి స్థలంలో మిద్దెపైన వంద గజాల స్థలంలో తొట్టెలు ఏర్పాటు చేసుకుని ఆకు కూరల సాగును ప్రారంభించారు. లక్ష్మీకి చిన్నతనం నుంచే మొక్కలు పెంచాలనే మక్కువ ఉండేది. ఆ ఇష్టం కాస్త ఆకు కూరలతో పాటు కాయగూరలు, పండ్లు ఫలాలు పండించేలా చేసింది.

ఆ తృప్తే వేరప్పా..

ఇంటిపై ఏర్పాటు చేసిన తోటలో పాలకూర, చుక్కకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు టమాటో, వంకాయ వంటి కూరగాయలు పండిస్తున్నారు. దానిమ్మ, జామ, బత్తాయి, రేగు, మామిడి, సపోట, స్టార్‌ ప్రూట్‌, నిమ్మ, అంజీర ఫలాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు వివిధ రకాల పూల చెట్లను సాగు చేస్తున్నారు. పూర్తిగా కిచెన్‌ వ్యర్థాలతో పాటు ఆవు పేడను ఎరువుగా వాడుతున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను ఇంట్లోకి వాడుకోవడమే కాకుండా ఇరుగుపొరుగు వాళ్లకు పంచుతున్నారు. స్వచ్ఛమైన కూరగాయలతో భోజనం చేస్తే ఆ తృప్తే వేరంటున్నారు.

అలా మొదలు పెట్టాం..

బయట దొరికే ఆకు, కూరగాయలు తినాలంటే వీరికి భయం వేసేది. ఎక్కడ పండిస్తున్నారో.. ఏ నీటితో పండిస్తున్నారో అర్థం కాకపోయేది. నగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఆకు కూరల సాగుచేస్తున్నారు. ఇలా పండించిన ఆకు కూరలను నగరంలో అమ్ముతున్నారు. ఫలితంగా పలు ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే మేమే సొంతంగా ఆకుకూరలు, పండ్లు పండిచుకోవాలనుకున్నాం.- లక్ష్మి, మిద్దెతోట నిర్వాహకురాలు.

ఆడుతూ.. పాడుతూ..

రోజుకో గంటపాటు తోటలో మొక్కలకు నీరు పోయడం, ఇతరత్రా పనులు చేస్తే వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత వస్తుంది. మమ్మల్ని చూసి ఇరుగుపొరుగు వాళ్లు మిద్దెతోటలను పెంచుతున్నారు. -రవీందర్​.

మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపైన తోటలను ఏర్పరుచుకుని స్వచ్ఛమైన కూరగాయలను పండించుకోవాలని కోరుతున్నారు ఆ దంపతులు.

ఇదీ చూడండి: కర్రతో వినూత్న ఆవిష్కరణలు... ఆకట్టుకుంటున్న సోదరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.