ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఓ బాల అభిమాని అభినందనలు తెలిపాడు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్ రావు... నిహాల్ అనే బాలుడిని సాగునీటి ప్రాజెక్టులకు బుల్లి ప్రచారకర్తగా నియమించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన అభిమాన నాయకుడు హరీశ్ రావును కలిసేందుకు నగరానికొచ్చాడు. కొంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీశ్ రావుని కలిసి అభినందనలు తెలిపాడు. తనను గుర్తుపెట్టుకొని ఖమ్మం నుంచి వచ్చిన ఆ బాలుడిని శాలువాతో సత్కరించారు మంత్రి.
ఇదీ చూడండి: 'మామ శాసనసభలో... అల్లుడు మండలిలో'