ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్.. అందులో కీలక అంశాలు!

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ-1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ-2గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్, ఏ-3గా తిరుపతికి చెందిన సింహయాజులుపై కేసు నమోదు చేశారు. ప్రలోభాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అటు.. తెరాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు కీలకాంశాలు పేర్కొన్నారు. భాజపాలో చేరితే తనకు వంద కోట్లతోపాటు కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురి చేశారని రోహిత్ రెడ్డి చెప్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంచేశారు.

fir
fir
author img

By

Published : Oct 27, 2022, 7:44 PM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాంహౌస్ వేదికగా తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ఘటనపో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై ప్రశ్నిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ -8, సెక్షన్ -120బీ కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏ1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్ , ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులును చేర్చారు. నిందితుల నుంచి వివరాలను సేకరించిన తర్వాత ముగ్గురిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలకాంశాలు పొందుపర్చారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో.... పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

భాజపాలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నందు మధ్య వర్తిత్వంతో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహయాజులు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు. తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరితే వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రోహిత్ రెడ్డి ఆరోపించారు. భాజపాలో చేరకపోతే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తుసంస్థలతో కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి తెలిపారు. తనకు వంద కోట్లు ఇవ్వడంతో తెరాసను వీడి భాజపాలో చేరే మిగతా ఎమ్మెల్యేలకు 50కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినట్లు వివరించారు. భాజపా తరఫున ఎమ్మెల్యేల కొనుగోలు పూర్తి చేసేందుకు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు... తన ఫామ్ హౌస్ కు వచ్చినట్లు రోహిత్ రెడ్డి చెప్పారు. అప్రజాస్వామికంగా, అనైతికంగా... తనతోపాటు సహచర ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టేందుకు చూసిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని రోహిత్ రెడ్డి కోరినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు. నిందితుల నుంచి వివరాలను సేకరించిన తర్వాత ముగ్గురిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.