దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అన్ని రోజుల నుంచి తిరుగుతున్నా అధికారులు.. అనుమతి ఇవ్వకుండా లంచం కావాలంటూ వేధిస్తున్నారని రామిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కోర్టుకు కూడా వెళ్లి అనుమతి ఇచ్చే విధంగా కంటోన్మెంట్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ... వారు స్పందించలేదన్నారు. ఎంతకీ వారు స్పందించకపోవడం వల్ల తాను ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు.
అనుమతి ఇవ్వమంటే.. చెప్పుతో కొట్టింది
విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం పనులు పరిశీలించేందుకు వచ్చి... డబ్బులు కట్టకుండా ఇల్లెలా కడతావంటూ బెదించారని రామిరెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో రామిరెడ్డి అనుమతి కోసం వాళ్లని మరోసారి అడగగా... కోపోద్రిక్తురాలైన మహిళా అధికారిణిి అతనిని చెప్పుతో కొట్టిందని వాపోయాడు. ఇష్టమొచ్చినట్లుగా తిడ్తూ... తనపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.
పై అధికారులకు ఫిర్యాదు చేస్తే... బెదిరిస్తున్నారు
ఈ విషయమై ఏసీబీ, సీఐడీ, పుణేలోని కంటోన్మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు. గత పది రోజులుగా తనను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపాడు. మహిళా అధికారిణి దాడికి పాల్పడడమే కాకుండా తనపై తప్పుడు కేసులు కూడా నమోదు చేశారని ఆవేదన చెందాడు. వెంటనే తనకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రామిరెడ్డి డిమాండ్ చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా అధికారిణిిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో దారుణం... 13 ఏళ్ల బాలికపై అత్యాచారం