ETV Bharat / state

'ట్యాబ్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ... ఒకరు మృతి' - Tab controversy Miyapur Boy death

హైదరాబాద్‌ మియాపూర్‌లో విషాదం నెలకొంది. ట్యాబ్‌ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి... ఓ పన్నెండేళ్ల బాలుడు బిల్డింగ్ మీద నుంచి దూకి మరణించాడు.

Boy Death
Boy Death
author img

By

Published : Feb 29, 2020, 11:42 PM IST

ఆడుకోవడానికి ట్యాబ్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన సత్య ప్రసాద్ (12) అనే బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. నగరంలోని మియాపూర్ లో ఈ ఘటన జరిగింది. మియాపూర్​ పీఎస్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్ పెంట్​హౌస్​లో ఉంటున్న శ్రీనివాస్​కు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు బాల వెంకట సత్య ప్రసాద్ ట్యాబ్ తో ఆడుకుంటుండగా పెద్దబ్బాయి నందకిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు. తండ్రి పెద్ద కుమారునికి ట్యాబ్​ను​ ఇచ్చాడు.

దీంతో మనస్తాపానికి గురైన సత్య ప్రసాద్ ఆ భవనం మీద నుంచి కిందకు దూకి మరణించాడు. అప్పటిదాకా కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడటం వల్ల తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్​లోని ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

'ట్యాబ్ కోసం అన్నదమ్ముల గొడవ... ఒకరు మృతి'

ఇదీ చూడండి : బాలికలతో వెట్టిచాకిరి చేయిస్తోన్న టీవీ యాంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.