ETV Bharat / state

భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. జగన్​పై 'చంద్ర' నిప్పులు

తెదేపా అధినేత చంద్రబాబు భోగి వేడుకలు చేసుకున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన

author img

By

Published : Jan 13, 2021, 10:30 AM IST

భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవోలు.. చంద్రబాబు నిరసన

ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాలలో భోగి మంటలు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులర్పించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, స్థానికులు హాజరయ్యారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవోలను చంద్రబాబు భోగిమంటల్లో వేశారు. జీవో నెం. 5కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర నిరసన తెలిపారు.

సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తూ... రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని నాశనం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై దాడులు.. ఆలయాలపై దాడుల విషయాన్ని ప్రస్తావించారు. తప్పు వాళ్లు చేసి.. నెపం తెదేపాపై వేస్తున్నారని ఆరోపించారు. అసలు ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ కు అర్హత ఉందా.. అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఉంటున్నామని.. ప్రజల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో తన విశ్వాసాన్ని ప్రారంభించి, ఇప్పుడు దేవాలయపైన వరుసగా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తుందని... డెకాయిట్ సీఎంకు దోచుకోవటం తప్ప ప్రజలకు న్యాయం చేయాలనే తపన లేదన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చంద్రబాబు తెల్చిచెప్పారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరని,రైతు కూలీలు చితికిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాల మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండానే.. చెల్లించానని అడ్డంగా దొంగ దొరికాడని దుయ్యబట్టారు.

రాష్ట్ర పరిస్థితులు బాధాకరం: ఎంపీ కేశినేని

వైకాపా ప్రభుత్వం విధ్వంసంతో పాలన ప్రారంభించి అన్ని వర్గాల్ని హింసిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని దుయ్యబట్టారు. రాష్ట్ర పరిస్థితులు బాధాకరమని.. రైతులకు ఉచిత విద్యుత్ దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతాంగాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారని విమర్శించారు. జగన్ తన నాశనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని నాని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తెలుగు లోగిళ్లలో భోగి సందడి... ఆకట్టుకుంటున్న బొమ్మల కొలువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.