పిల్లలు ఆర్థికంగా స్థిరపడి... ఎటువంటి కష్టాలు లేకుండా... జీవిత చరమాంకంలో రోజులు హాయిగా గడిచిపోతే చాలు ఎవరు ఏలా ఉంటే మనకెందుకులే అనుకుంటారు చాలా మంది... కానీ ఓ వృద్ధురాలు అలా ఆలోచించలేదు. కమ్మేస్తున్న కరోనాలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిపోయింది. ప్రత్యక్షంగా తాను వారికి ఏమీ చేయలేకపోతున్నానని బాధపడింది. తాను చేయగలిగింది కేవలం ఆర్థిక సహాయమే అని భావించి లక్షరూపాయల చెక్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందించించి కూకట్పల్లి వసంతనగర్కు చెందిన తొంబైఏళ్ల వృద్ధురాలు రాజమణి.
కరోనా నిర్మూలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి అందరూ తమ వంతుగా చేయూతనివ్వడం గొప్పవిషయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కష్టకాలంలో పెద్దమనసుతో ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కష్టకాలంలో తన వంతు సాయం చేసిన రాజమణి గురించి తెలిసిన వారెవరైనా బామ్మ మనసు బంగారం అని కొనియాడుతున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి