ఆంధ్రాలోనూ కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో 998 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో విదేశానికి చెందిన ఒకరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 36 మంది ఉండగా.. ఏపీకి చెందిన 961 మందికి పాజిటివ్ వచ్చింది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 18,697 కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలులో 5, అనంతపురంలో 3, చిత్తూరు జిల్లాలో 2, కడపలో 2 ఇద్దరు మృతి చెందగా... కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 232కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8422కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 10,043 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'