ETV Bharat / state

'90 క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ' - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

లాక్​డౌన్ నేపథ్యంలో హైదరాబాద్​లో నివసించే పేదవారు ఆకలితో అలమటించకూడదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు పునరావాస కేంద్రాల్లో ఉన్న అన్నార్థులకు బియ్యం అందజేయాలని పోలీసు శాఖ కోరింది. వారి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 90 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసు శాఖకు అందజేసింది.

90 quintals of rice distribution in ghmc orphans
'90 క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ'
author img

By

Published : Apr 4, 2020, 11:48 AM IST

జీహెచ్ఎంసీ పరిధిలో పలు పునరావాస కేంద్రాల్లో కార్మికులకు భోజనం అందించేందుకు బియ్యం అందించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 90 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని వారికి పంపిణీ చేసింది.

ప్రభుత్వ సహాయానికి తోడుగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని మేయర్ బొంతు రామ్మోహన్​ కోరారు. పేదలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బియ్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందించిన బియ్యాన్ని అవసరమైన చోట వండి పెడతామని పోలీసులు పేర్కొన్నారు. అవసరమైన వారికి బియ్యాన్ని అందిస్తామని తెలిపారు.

'90 క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ'

ఇదీ చూడండి : అవయవ మార్పిడికీ తప్పని అంతరాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.