ETV Bharat / state

degree colleges: క్లస్టర్‌ విధానంలోకి 9 డిగ్రీ కళాశాలలు - తెలంగాణ 2021 వార్తలు

ఈ ఏడు విద్యా సంవత్సరం క్లస్టర్ విధానంలోకి 9 డిగ్రీ కళాశాలలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

9-degree-colleges-into-cluster-policy
క్లస్టర్‌ విధానంలోకి 9 డిగ్రీ కళాశాలలు
author img

By

Published : Aug 7, 2021, 10:12 AM IST

డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తలపెట్టిన క్లస్టర్‌ కళాశాలల విధానంలోకి 9 స్వయంప్రతిపత్తి కళాశాలలను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానంలో చేరిన కళాశాలలు మానవ వనరులు, ఇతర వసతులను పరస్పరం వినియోగించుకోవచ్చు. విద్యార్థులు తాము చేరిన కళాశాలల్లో ఇష్టమైన సబ్జెక్టు లేకుంటే క్లస్టర్‌ విధానంలోని ఇతర కళాశాలలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో చదువుకోవచ్చు. తొలుత ఈ విధానంలోకి హైదరాబాద్‌లోని తొమ్మిది కళాశాలలను తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఓయూ ఉపకులపతి రవీందర్‌ తదితరులతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఎదురయ్యే అవరోధాలను పరిష్కరించుకుంటూ..

ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు లింబాద్రి వెల్లడించారు. అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్లేలా చేస్తామని, ఒక వేళ ప్రధాన కోర్సు సబ్జెక్టును మరో కళాశాలలో పూర్తి చేయడానికి అవకాశం లేకుంటే ఎలక్టివ్‌ కోర్సును లేదా సర్టిఫికెట్‌ కోర్సును పూర్తి చేసేలా ఆలోచన ఉందన్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేసే క్రమంలో ఎదురయ్యే అవరోధాలను పరిష్కరించుకుంటూ ఈ విధానాన్ని ఎక్కువ కళాశాలలకు విస్తరిస్తామన్నారు. క్లస్టర్‌ విధానం అమలుపై కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో కార్యశాలలు, సదస్సులు నిర్వహించి లోతుగా అధ్యయనం చేయాలని ఛైర్మన్‌ పాపిరెడ్డి సూచించారని, త్వరలో వాటిని నిర్వహిస్తామని చెప్పారు.

ఇవీ ముఖ్యమైన నిర్ణయాలు

  • క్లస్టర్‌ విధానంలో ఎంపిక చేసిన తొమ్మిది కళాశాలలు.. కోఠి మహిళ, నిజాం, సిటీ, బేగంపేట మహిళ, రెడ్డి మహిళ(నారాయణగూడ), సెయింట్‌ ఆన్స్‌-మొహిదీపట్నం, సెయింట్‌ ఫ్రాన్సిస్‌-బేగంపేట, భవాన్స్‌ కళాశాల-సైనిక్‌పురి, అల్వాల్‌లోని లయోలా అకాడమీ.
  • ప్రస్తుతం డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు కొత్త విధానాన్ని అమలు చేస్తారు.
  • ఆయా వసతులు, వనరులను వినియోగించుకోవాలంటే ఆ కళాశాలల మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ఉండాలి.
  • విద్య, మౌలిక వసతులు-ఇతర వనరులు, మార్గదర్శకాల తయారీ అంశాలపై ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మూడు వర్కింగ్‌ కమిటీలను నియమించారు. అవి 10-15 రోజుల్లో నివేదికలు అందజేస్తాయి. ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఒక సబ్జెక్టును మరో ప్రైవేట్‌ కళాశాలలో చదువుకోవాలంటే ఫీజు ఎంత? ఎలా వసూలు చేయాలి? క్రెడిట్లు బదిలీ ఎలా? పరీక్ష విధానం తదితర అంశాలపై కమిటీలు విధి విధానాలు రూపొందిస్తాయి.

ఇదీ చూడండి: గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారులు.. చివరికి తల్లులతో పాటే జైలుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.