ETV Bharat / state

గుర్రాలతోనే జీవితస్వారీ... - గుర్రాలతోనే జీవితస్వారీ...

వారసత్వంగా వచ్చిన అశ్వాలు.. వాటితోనే ఆ కుటుంబానికి జీవనాధారం. ఏ వేడుకైనా, శుభకార్యామైనా, ఊరేంగిపులకైనా.. వారి గుర్రాలు ఉండాల్సిందే. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమలో రికార్డులు తిరగరాసిన సినిమాల్లోని అశ్వాలు.. వాళ్ల కుటుంబానివే. గుర్రాలతోనే జీవితస్వారీ చేస్తున్న ఆ కుటుంబం గురించి మనము తెలుసుకుందామా!

గుర్రాలతోనే జీవితస్వారీ...
author img

By

Published : May 17, 2019, 8:34 AM IST

గుర్రపుస్వారీ... అనగానే సినిమాల్లో హీరోలు చేసే వీరోచిత పోరాటం గుర్తుకొస్తుంది. ఎన్టీరామారావు నుంచి బాహుబలి వరకు గుర్రాలపై తీసే దౌడ్​కి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అశ్వాలు చిత్రాల్లో కనిపిస్తే.. నిర్మాతలకు కాసుల వర్షం. ఇలాంటి గుర్రాలు సినిమాల్లోనే కాదు మనవద్దా ఉన్నాయి. హైదరాబాద్​ చుడీబజార్​లోని జమారొద్దీన్ వద్దకు వెళ్తే ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

గుర్రాలతోనే జీవితస్వారీ...

తెలుగు చలన చిత్రపరిశ్రమలో రికార్డులు తిరగరాసిన సినిమాల్లోని గుర్రాలు చుడీబజార్​లోని జమారొద్దీన్​ ఇంటి ముందు మేతమేస్తూ సాదాసీదాగా కన్పిస్తుంటాయి. వందేళ్ల క్రితం నుంచే జమార్ తాతాల నుంచి గుర్రాలను, ఒంటెలు, ఏనుగుల్ని పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: అద్భుత కళాఖండాలు... సీసాల్లో చెక్క బొమ్మలు

జీవనాధారంగా మారిన గుర్రాలు...

నిజాంల కాలంలో జమార్ తాత హరీపొద్దీన్ పనికి కుదిరాడు. ఆ తర్వాత సొంతంగా ఓ జట్కా బండి కొని వ్యాపారం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆ గుర్రాలే వారి కుటుంబానికి జీవనాధారంగా మారిపోయాయి. ఒకప్పుడు అనేక జంతువులను పోషించినా....ఇప్పుడు కేవలం గుర్రాలు మాత్రమే పెంచుతున్నారు.

సినిమాల్లోనూ...

జమారొద్దీన్​ కుటుంబం వద్ద వందకు పైగా గుర్రాలున్నాయి. శుభకార్యాలకు, వివాహ విందులకు, జన్మదినాలకు, ఊరేగింపులకు, సినిమా షూటింగ్​లకు, ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్రాలను అద్దెకు ఇస్తుంటారు. సైరా.. నరసింహారెడ్డి, బహుబలి, రాజన్న, మగధీర, కృష్ణబాబు, అశోక్ సామ్రాట్, అడవిరాజా, సూర్యవంశం, అమితాబచ్చన్-సూర్యవంశం సినిమాల్లో ఉన్నవి తమ గుర్రాలే అని గర్వంగా చెబుతాడు.

ఇదీ చూడండి: కథలు చెప్తామండీ... కథలు చెప్తాం...!

అందమైన గుర్రపు బండ్లు మరో ప్రత్యేకత...

గుర్రాలను హైదరాబాద్​తో పాటు కరీంనగర్​, వరంగల్, విజయవాడ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. సినిమా చిత్రీకరణ​లో అవసరమైతే హీరోలకు డూప్​గా కూడా చేస్తారు.

రెండు నుంచి మూడు వందల ఖర్చు...

ప్రతిరోజూ గుర్రాలకు రెండు వందల నుంచి మూడు వందల వరకు ఖర్చవుతుంది. శుభకార్యాలు జరిగినప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు. మిగతా సమయాల్లో వాటి పోషణ ఖర్చుకూడా చేతినుంచి పెట్టుకోవాల్సదే. అయినా సరే తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని వదులుకోమంటారు జమార్ కుటుంబసభ్యులు.

ఇదీ చూడండి: కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.