ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 3200 మందికి వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో 12,613 మంది నుంచి నమూనాల సేకరించారు. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు మొత్తం 64 మంది మృతి చెందగా.. 2209 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 927 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కొత్తగా కొవిడ్‌తో ఎవరూ మరణించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చూడండి: పోరాటాల తెలంగాణలో సంస్కరణల పాలన