హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భాజపా ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీపై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగ బద్ధంగానే రూపొందించామని పేర్కొన్నారు. విపక్షాలు మోదీని నియంత్రించేందుకు సీఏఏను అడ్డంపెట్టుకుని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు. తెరాస శరీరంలో మజ్లిస్ ఆత్మ ఉందని అందుకే సీఏఏను వ్యతిరేకించిందన్నారు.
ఎనభై వేల పుస్తకాలు చదివానంటున్న కేసీఆర్ రాజ్యాంగం చదవలేకపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడమంటే అది కేసీఆర్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
ఇదీ చూడండి : 'ప్రశ్నించినందుకు రేవంత్రెడ్డి అక్రమ అరెస్టు'