హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని నిరంకారి కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫైన్ విధిస్తున్న సమయంలో పోలీసులు అతనిపై ఉన్న పెండింగ్ చలాన్లు చూసి విస్తుపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 చలాన్లు ఉన్నట్టు బయటపడింది. రాంనగర్‌కు చెందిన సురేష్‌గౌడ్ యాక్టివాపై రెండేళ్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. చలాన్లకు సంబంధించిన 7695 రూపాయలు చెల్లించాల్సిందేనని పోలీసులు సూచించడం వల్ల వాహనదారుడు ఈ-సేవా కేంద్రంలో మొత్తం చెల్లించాడు. జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారు తనిఖీల్లో పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: పరవళ్లు తొక్కుతున్న నదులు... నిండుకుండల్లా జలాశయాలు