రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 7,646 కొవిడ్ కేసులు నమోదుకాగా... మరో 53 మంది మృతి చెందారు. కరోనా నుంచి 5,926 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 77,727 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 77,091 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కిట్ల కొరత కారణంగా తక్కువ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1,441 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 631, రంగారెడ్డి జిల్లాలో 484, ఆదిలాబాద్ 99, భద్రాద్రి కొత్తగూడెం 114, జగిత్యాల 230, జనగామ 54, జయశంకర్ భూపాలపల్లి 55, జోగులాంబ గద్వాల 85, కామారెడ్డి 153, కరీంనగర్ 274, ఖమ్మం 212, కొమరంభీం ఆసిఫాబాద్ 106, మహబూబ్ నగర్ 243, మహబూబాబాద్ 110, మంచిర్యాల 191, మెదక్ 137, ములుగు 36, నాగర్ కర్నూల్ 198, నల్గొండ 285, నారాయణపేట 47, నిర్మల్ 130, నిజామాబాద్ 330, పెద్దపల్లి 139, రాజన్న సిరిసిల్ల 139, సంగారెడ్డి 401, సిద్దిపేట 289, సూర్యాపేట 283, వికారాబాద్ 189, వనపర్తి 120, వరంగల్ రూరల్ 105, వరంగల్ అర్బన్152, యాదాద్రి భువనగిరి జిల్లాలో 184 మంది కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో వంద రెమ్డెసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం