ETV Bharat / state

ప్రకృతి వనాలకు శ్రీకారం... దట్టమైన చిట్టడవులే లక్ష్యం

పచ్చదనం పెంపుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే ధ్యేయంగా... రాష్ట్రంలో ప్రకృతి వనాలకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు ఐదు వేల చోట్ల ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. మిగతాచోట్ల పనులు వివిధ దశల్లో ఉండగా... చాలా చోట్ల ప్రకృతివనాలకు భూముల లభ్యత కొంత ఇబ్బందికరంగా మారింది.

ప్రకృతి వనాలకు శ్రీకారం... దట్టమైన చిట్టడవులే లక్ష్యం
ప్రకృతి వనాలకు శ్రీకారం... దట్టమైన చిట్టడవులే లక్ష్యం
author img

By

Published : Aug 14, 2020, 5:48 AM IST

ప్రకృతి వనాలకు శ్రీకారం... దట్టమైన చిట్టడవులే లక్ష్యం

ఆరోవిడత హరితహారంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువమొక్కలు నాటి దట్టమైన చిట్టడవిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రకృతి వనాలను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లక్కారం అటవీబ్లాక్‌లోని తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో ఈతరహా కార్యక్రమం విజయవంతమైంది. యాదాద్రి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతివనాలను అధికారులు చేపట్టారు.

ఉపాధిహామీతో వనాల పెంపు...

పల్లెలతో పాటు పట్టణాల్లో ప్రకృతివనాల పనులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా గ్రామపంచాయతీల్లో ఊరూరా ప్రకృతివనాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అందుకోసం ఉపాధిహామీ పథకం నిధులను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రకృతివనాల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రకృతివనాల పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీకారం చుట్టారు. చాలాచోట్ల మొక్కలు కొంతమేర పెరిగాయి.

3,500 గ్రామాల్లో పనులు ప్రారంభం...

గ్రేటర్ హైదరాబాద్ సహా హెచ్​ఎండీఏ పరిధిలోని అటవీబ్లాకులు, పార్కుల్లో, బాహ్యవలయ రహదారి కూడళ్ల సమీపంలో ప్రకృతివనాల పనులు ప్రారంభించారు. మిగతా 139 నగర, పురపాలికల్లో 739 చోట్ల ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించారు. రాష్ట్రంలోని 12వేల పైచిలుకు గ్రామపంచాయతీల్లో ఇప్పటి వరకు 9వేల 914 పల్లెల్లో అనువైన స్థలాలను గుర్తించారు. మరో 3వేల575 చోట్ల స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. స్థలాలు ఎంపిక చేసిన 9వేల914 పంచాయతీలకుగాను 3వేల500 గ్రామాల్లో ప్రకృతివనాల అభివృద్ధి పనులు చేపట్టారు. మరో 2500 చోట్ల సన్నద్ధత పనులు జరుగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ప్రకృతివనాల పనులపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇంబ్బందిగా మారిన భూసేకరణ...

ప్రకృతివనాల అభివృద్ధికి అవసరమైన భూముల లభ్యత కొంత ఇబ్బందిగా మారింది. కనీసం ఎకరం స్థలం అయినా అవసరంకాగా... కొన్ని ప్రాంతాల్లో ఆ మేరకు కూడా లభించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రకృతివనాలకు అవసరమైన భూములను గుర్తించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీ చూడండి: అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.