ETV Bharat / state

నగరంలో 67 మంది విదేశీయులు... ఎక్కడెక్కడ తిరిగారంటే?

author img

By

Published : Mar 21, 2020, 1:35 PM IST

కరీంనగర్​లో సంచరించిన ఇండోనేసియా వాసుల్లో 8 మందికి కరోనా వైరస్​ ఉందని తెలియడం వల్ల జంటనగరాల పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్​లో ఆధ్యాత్మిక సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లింల జాబితాను ఆఘమేఘాల మీద సేకరించారు. కజకిస్తాన్​, మలేసియా, థాయ్​లాండ్​, ఇరాన్​, సూడాన్​ దేశాల నుంచి 67 మంది గత నెల 29 వేర్వేరు మార్గాల్లో నగరానికి వచ్చారు.

67-foreigners-in-hyderabad
నగరంలో 67 మంది విదేశీయులు... ఎక్కడెక్కడ తిరిగారంటే?

రాష్ట్ర రాజధానికి విడతల వారీగా గత నెల 29 నుంచి వచ్చిన 64 మంది విదేశీయుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరితో పాటు మార్గనిర్దేశం చేసేందుకు మధ్యప్రదేశ్​ యువకుడు, ఉత్తర్​ప్రదేశ్​ యువకుడు తోడుగా వచ్చారు. వీరంతా ఈనెల 1న హైదరాబాద్​లోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదులకు వెళ్లి అక్కడ ఆధ్యాత్మిక సభల్లో పాల్గొన్నారు. కరీంనగర్​లో పర్యటించిన ఇండోనేషియా దేశస్థులకు కరోనా వైరస్​ ఉన్నట్లే... వీరికి ఉందేమోనన్న భావనతో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఇందులో ఒకరిని ఛాతీ ఆసుపత్రికి, 13 మందిని ఫీవర్​ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్​లోని ఒక మతసంస్థ ఆహ్వానం మేరకు విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చారు.

వివరాలిలా...

కజకిస్తాన్ 19 మంది
థాయిలాండ్​ 8 మంది
మలేసియా 13 మంది
ఇరాన్​ 14 మంది

వారిలో ఒక్కరికి కరోనా లక్షణాలు

విదేశీయులు వారి వారి దేశాల నుంచి బయలుదేరి గత నెల దిల్లీకి చేరుకున్నారు. గత నెల 29 నుంచి ఈనెల 12 వరకు విడతల వారీగా విమానాలు, రైళ్లలో హైదరాబాద్​ చేరుకున్నారు. ఒక బృందానికి యూపీ, ఎంపీ యువకులు గైడ్లుగా, మరో బృందానికి అసోం, పాండిచ్చేరికి చెందిన యువకులు గైడ్లుగా వ్యవహరించారు. అందరూ హైదరాబాద్​కు చేరుకున్నాక బృందాలుగా విడిపోయి... నగరంలోని మసీదులు, ముస్లింలకు చెందిన ఇళ్లలో ఆశ్రయం పొందారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఒకరికి మినహా కరోనా అనుమానిత లక్షణాలు కనిపించలేదని పోలీసు అధికారులు తెలిపారు.

బృందాలుగా విడిపోయి పర్యటన

విదేశాల నుంచి వచ్చిన ముస్లింలలో కొందరు మార్చి 2 నుంచి బృందాలుగా విడిపోయారు. తొలుత పంజాగుట్ట మసీదులో నిర్వహించిన ఆధ్యాత్మిక సభల్లో పాల్గొన్నారు. కొందరు ఒకరోజు బసచేయగా.. మరికొందరు రెండు రోజులు బసచేశారు. అనంతరం పాతబస్తీ రియాసత్​ నగర్​లోని ఒక మసీదులో తాత్కాలికంగా ఆశ్రయం పొందారు.

పోలీసుల అనుమతి లేకుండా వెళ్లొద్దు

మలేసియా, థాయిలాండ్​, కజకిస్తాన్​, ఇరాన్​ల నుంచి వచ్చిన ముస్లింలు మతసంస్థ నిర్వాహకులను కలిశారు. అందరూ సమావేశమయ్యాక నగరంలోని మసీదుల్లో జరిగే ప్రార్ధనలు, ఆధ్యాత్మిక సభల్లో పాల్గొంటామంటూ నిర్వాహకులకు తెలిపారు. మలక్​పేట్​, మల్లేపల్లి మసీదుల్లో ఐదు రోజుల పాటు జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించామని ఆరోగ్యంగా ఉన్న వారిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. 14 రోజుల పాటు నిబంధనలు పాటించాలని వారికి సూచించామని స్పష్టం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటించవద్దని విదేశీయులకు పోలీసులు సూచించారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.