తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోమరో 6,542 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో కొత్తగా మరో 20 మంది మృతి చెందారు. తాజాగా మరో 2,887 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 46 వేలు దాటాయి. ప్రస్తుతం 46,488 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 1,30,105 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 898 కొవిడ్ కేసులు రాగా.. మేడ్చల్-570, రంగారెడ్డి-532, నిజామాబాద్-427, సంగారెడ్డి-320, నల్గొండ-285, మహబూబ్‌నగర్-263, వరంగల్ అర్బన్- 244, జగిత్యాల- 230, ఖమ్మం- 246, కామారెడ్డి జిల్లా- 235 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య