ETV Bharat / state

TS COVID CASES: 647 మందికి సోకిన వైరస్.. మరో ఇద్దరు మృతి - కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందగా... మరో 647 మందికి వైరస్​ సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

TG COROANA CASES
తెలంగాణలో కరోనా కేసులు
author img

By

Published : Jul 24, 2021, 8:18 PM IST

తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు కొవిడ్​ బారిన పడిన వారి సంఖ్య 6,40,659కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,20,213 మందికి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 647 మందికి పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,625 కొవిడ్​ యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

వైరస్​ బారిన పడి తాజాగా మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,780కి చేరింది. తాజాగా 749 మంది బాధితులు కొవిడ్​ను జయించారు. ​ఇప్పటివరకు 6,27,254‬ మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి: నవ దంపతుల ఆత్మహత్య.. కరోనా భయమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.