ETV Bharat / state

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 623 కరోనా కేసులు.. 3 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 746 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

Corona Cases
కరోనా కేసులు
author img

By

Published : Jul 29, 2021, 7:28 PM IST

Updated : Jul 29, 2021, 7:49 PM IST

తెలంగాణలో తాజాగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 746 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,30,732కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. ఇవాళ 1,11,947 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,06,462 పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్​సీల్లో చేయగా మిగతా 5,485 టెస్టులు ప్రైవేట్​లో నిర్వహించారు.

జాగ్రత్తలు పాటించాలి

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్​ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

జిల్లాల వారీగా కేసులు

రాష్ట్రంలో 21 ఆర్టీపీసీఆర్​ పరీక్ష కేంద్రాలు ఉండగా.. 63 ప్రైవేట్​ ఆర్టీపీసీఆర్​ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 1064 ర్యాపిడ్​ యాంటిజెన్​​ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్​ఎంసీలో కొత్తగా 70 కేసులు నమోదు కాగా.. కరీంనగర్ జిల్లాలో​ 68, వరంగల్​ అర్బన్​ 67, ఖమ్మం 51, పెద్దపల్లి 43, నల్గొండ 38, రంగారెడ్డి 33, మేడ్చల్​ మల్కాజిగిరి 29, జగిత్యాల 27, సూర్యాపేట 21, రాజన్న సిరిసిల్ల 18, భద్రాద్రి కొత్తగూడెం 17, సిద్దిపేట 17, మహబూబాబాద్​ 16, మంచిర్యాల 16, యాదాద్రి భువనగిరి 14, వరంగల్​ రూరల్​ 13, జనగామ 8, నిజామాబాద్​ 7, మహబూబ్​నగర్​ 6, ములుగు 7, ఆదిలాబాద్​ 5, వికారాబాద్​ 5, సంగారెడ్డి 5, మెదక్​ 4, నాగర్​ కర్నూల్​ 4, జయశంకర్​ భూపాలపల్లి 3, కుమురం భీం ఆసిఫాబాద్​ 3, కామారెడ్డి 3, జోగులాంబ గద్వాల 1, నిర్మల్​ జిల్లాలో ఒక కేసు నమోదు అయింది. నారాయణపేట జిల్లా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలు'

Last Updated : Jul 29, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.