రాష్ట్రంలో కొత్తగా 617 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,82,347 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కరోనాతో ఇప్పటివరకు 1,518 మంది మృతిచెందగా... మరో 635 మంది బాధితులు కోలుకున్నారు.
ఇప్పటివరకు 2,74,260 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 6,569 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 4,400 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కథేంటి?