ETV Bharat / state

ఆర్టీఏలో 6 కొత్త ఆన్​లైన్​ సేవలు ప్రారంభం

ఇంటి నుంచే ఆన్​లైన్​లో సేవలు పొందేలా కొత్తగా మరో 6 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ‌తెలిపారు. ఇంట్లో నుంచే కంప్యూటర్‌‌, స్మార్ట్ ఫోన్‌ ‌ద్వారా కూడా కావల్సిన సేవల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

6 new online services available in rta
ఆర్టీఏలో 6 కొత్త ఆన్​లైన్​ సేవలు ప్రారంభం
author img

By

Published : Sep 2, 2020, 7:24 PM IST

ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్​లైన్​లో సేవలు పొందేలా కొత్తగా మరో 6 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ‌తెలిపారు. ఇంట్లో నుంచే కంప్యూటర్‌‌, స్మార్ట్ ఫోన్‌ ‌ద్వారా కూడా కావల్సిన సేవల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర లైసెన్స్‌ను ఆమోదించడం, గడువు ముగిసిన లెర్నర్ లైసెన్స్ స్థానంలో కొత్త లెర్నర్ లైసెన్స్, వాహన తరగతిని చేర్చడానికి అభ్యాస లైసెన్స్, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం లెర్నర్ లైసెన్స్ జారీ వంటి మరో 6 ఆన్ లైన్ సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

గత జూన్ 24న డూప్లికేట్ ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌ (లెర్నర్‌‌ లైసెన్స్‌‌), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలతో ఆర్టీఏ ఆఫీసుల్లో పనుల కోసం ఏజంట్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ప్రమేయం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ఎంపిక చేసిన సేవలను పొందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.