ETV Bharat / state

5PM TOPNEWS: టాప్ న్యూస్@5PM - ఇప్పటివరకున్న ప్రధాన వార్తలు

ఇప్పటివరకున్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Apr 10, 2022, 4:59 PM IST

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిర్వహించని శోభాయాత్రను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్టహసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.

  • బైక్​ రేసింగులతో రెచ్చిపోతున్న యువత..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో బైక్​ రేసింగ్​లు నడుస్తున్నాయి. రాత్రయితే చాలు బైకులతో రోడ్డెక్కేస్తున్న యువకులు.. రేసింగులు, విన్యాసాలంటూ నానా రచ్చ చేస్తున్నారు. వీటిపై పోలీసులు ఫోనక్​ ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే పలువురు యువకులను అరెస్ట్​ చేశారు.

  • ఏచూరి హ్యాట్రిక్..

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. కేరళలో జరిగిన 23వ వార్షిక సదస్సులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేరకు నిర్ణయించింది.

  • 'ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి'

రాహుల్​ గాంధీ.. ఇతర రాజకీయ పక్షాల గురించి కాకుండా తన సొంత పార్టీ గురించి ఆలోచించాలన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆయన వ్యాఖ్యలు కులతత్వాన్ని, ద్వేషపూరిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు.

  • జవాన్ మృతికి రివెంజ్..

శ్రీనగర్​లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్​పీఎఫ్​ జవాన్లపై కాల్పులకు తెగబడి, ఒకరిని బలిగొన్న ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు.

  • జ్యూస్​లో 'వయాగ్రా' పిల్స్..

ఆ విద్యార్థులంతా ఓ ఆన్​లైన్​ ఛాలెంజ్​లో పాల్గొన్నారు. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్​ వేసుకొని తాగారు. కాసేపటికే 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. అసలిది ఎక్కడ జరిగింది? ఏమైంది?

  • 'బేబీ ఏబీ' అరుదైన రికార్డు..

ఐపీఎల్​ 2022 సీజన్​లో ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​ బేబీ ఏబీ డెవాల్డ్​ బ్రెవిస్​ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ కెరీర్​లో తాను వేసిన తొలి బంతికే వికెట్​ తీశాడీ సౌతాఫ్రికా ఆటగాడు. ఇతడిని మెగా వేలంలో రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​.

  • కేజీయఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కథ నిజమేనా?

రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ ఛాప్టర్ 2' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలి భాగంలో హీరో ఎలివేషన్స్​తో ప్రేక్షకులను కట్టిపడేసిన మరో అంశం.. కథ. బంగారు సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు కొందరి వ్యక్తుల పోరు.. అక్కడి కార్మికుల కష్టాలను ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

  • 25 మందితో ఏపీ కొత్త కేబినెట్..

25 మందితో ఏపీ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. జాబితాలో బొత్స, రాజన్న దొర, రోజా, ధర్మాన, గుడివాడ అమర్​నాథ్, అంబటి రాంబాబుతో పాటు మరికొందరు పేర్లు ఉన్నాయి.

  • 'తెరాస చేసేది రైతు దీక్ష కాదు.. దోపిడీ దీక్ష'

కేంద్రంపై తెరాస చేస్తున్న ఉద్యమంలో భాగంగా రేపు దిల్లీలో చేయబోతున్న దీక్షపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీక్షల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తున్నాయి. దిల్లీలో తెరాస చేయబోయే దీక్షను దోపిడీ దీక్షగా కాంగ్రెస్​ సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు.

  • వైభవంగా సాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిర్వహించని శోభాయాత్రను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్టహసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.

  • బైక్​ రేసింగులతో రెచ్చిపోతున్న యువత..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో బైక్​ రేసింగ్​లు నడుస్తున్నాయి. రాత్రయితే చాలు బైకులతో రోడ్డెక్కేస్తున్న యువకులు.. రేసింగులు, విన్యాసాలంటూ నానా రచ్చ చేస్తున్నారు. వీటిపై పోలీసులు ఫోనక్​ ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే పలువురు యువకులను అరెస్ట్​ చేశారు.

  • ఏచూరి హ్యాట్రిక్..

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. కేరళలో జరిగిన 23వ వార్షిక సదస్సులో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మేరకు నిర్ణయించింది.

  • 'ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి'

రాహుల్​ గాంధీ.. ఇతర రాజకీయ పక్షాల గురించి కాకుండా తన సొంత పార్టీ గురించి ఆలోచించాలన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆయన వ్యాఖ్యలు కులతత్వాన్ని, ద్వేషపూరిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు.

  • జవాన్ మృతికి రివెంజ్..

శ్రీనగర్​లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్​పీఎఫ్​ జవాన్లపై కాల్పులకు తెగబడి, ఒకరిని బలిగొన్న ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు.

  • జ్యూస్​లో 'వయాగ్రా' పిల్స్..

ఆ విద్యార్థులంతా ఓ ఆన్​లైన్​ ఛాలెంజ్​లో పాల్గొన్నారు. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్​ వేసుకొని తాగారు. కాసేపటికే 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. అసలిది ఎక్కడ జరిగింది? ఏమైంది?

  • 'బేబీ ఏబీ' అరుదైన రికార్డు..

ఐపీఎల్​ 2022 సీజన్​లో ముంబయి ఇండియన్స్​ ప్లేయర్​ బేబీ ఏబీ డెవాల్డ్​ బ్రెవిస్​ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ కెరీర్​లో తాను వేసిన తొలి బంతికే వికెట్​ తీశాడీ సౌతాఫ్రికా ఆటగాడు. ఇతడిని మెగా వేలంలో రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​.

  • కేజీయఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కథ నిజమేనా?

రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ ఛాప్టర్ 2' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలి భాగంలో హీరో ఎలివేషన్స్​తో ప్రేక్షకులను కట్టిపడేసిన మరో అంశం.. కథ. బంగారు సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు కొందరి వ్యక్తుల పోరు.. అక్కడి కార్మికుల కష్టాలను ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.